మక్లూర్ మండల ఎమ్మార్వోను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
సాధారణ బదిలీల్లో మక్లూర్ మండల ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ ను మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. మండలంలో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలగడ్డ వినోద్ కుమార్, ఎస్కే ఆరిఫ్, పుప్పల చిన్న బేగరీ, సుమన్, దొడ్ల సతీష్, ప్రభాకర్ గౌడ్, తలారి గంగన్న, మాస్టర్ రవి, నవతే నవీన్ పాల్గొన్నారు.