మాక్లూర్ మండల ప్రజాపరిషత్ లో ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గురువారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకటేశ్వరరావును విడిసి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, గంగా ప్రసాద్, అనిల్, అలిమ్, జాలి సింగ్, సలీమ్, నరేష్, స్వామి పాల్గొన్నారు.