క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. ఈ చర్చల్లో బాగంగా పురాతన వస్తువుల గురించి మాట్లాడారు. ఈ మేరకు అక్రమ రవాణా సందర్భంగా స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో 297 పురాతన వస్తువులు తిరిగి భారత్ కు రానున్నాయి.