నవీపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ వెంచర్ లొ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా స్థలాన్ని అడ్డుకోవాలని వెంచర్ లోని కొనుగోలుదారులు, బిజెపి నాయకులు ఎమ్మార్వో, ఎస్సై మరియు కార్యదర్శులకు బుధవారం ఫిర్యాదు చేశారు. 80% హిందువులు కొనుగోలు చేసిన వెంచర్ లో హిందూయేతర ప్రార్థన స్థలం నిర్మాణం వలన తమకు ఆర్థిక నష్టంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొంటామని వెంటనే ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.