ఆర్అండ్ బిరాష్ట్ర చీఫ్ ఇంజనీర్‌ను కలిసిన ఆలయ అభివృద్ధి కమిటీ

78చూసినవారు
ఆర్అండ్ బిరాష్ట్ర చీఫ్ ఇంజనీర్‌ను కలిసిన ఆలయ అభివృద్ధి కమిటీ
తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్‌ను సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ హైదరాబాదులోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించారు. సిరికొండ శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి మహా పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గమధ్యలో నూతన బ్రిడ్జిల నిర్మాణానికి 3 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపామని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్