అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దామ సునీల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన నిజామాబాద్ లో మాట్లాడారు. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర పిలుపుమేరకు శనివారం చలో బాసర త్రిపుల్ ఐటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించ తలపెట్టగా ఉదయం నుండే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయడం జరిగిందన్నారు. దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.