పిట్లంలో విషాదం.. యువకుడు మృతి
పిట్లం గ్రామంలో విషాదం జరిగింది. ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు చెరువులో శవమై కనిపించాడు. గ్రామానికి చెందిన జంగం విఠల్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెళ్లిన అతను ఇంటికి రాక పోయేసరికి కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా జాడ లేదు. శుక్రవారం మారేడు చెరువు వైపు వెళ్లే వారికి చెరువులో విఠల్ శవం తేలియాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు.