కామారెడ్డి: రైతులను విడుదల చేయాలని ధర్నా
లగచర్ల గిరిజన రైతులను విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల అరెస్టును నిరసిస్తూ మంగళవారం రామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూతురు, అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.