TG: రాష్ట్రంలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా తూర్పు జిల్లాలైనా భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లా పొగమంచు ఎక్కువగా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయన్నారు.