ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన పారిశుద్ధ్యం
రుద్రూర్ మండల వ్యాప్తంగా పల్లెలలో మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండిపోవడం, చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో అపరిశుద్ధ్యం నెలకొంది. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు అసలు పట్టించుకోవడమే లేదని, దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాలలో పేరుకుపోయిన పారిశుద్ధ్యాన్ని తొలగించాలన్నారు.