![సదాశివనగర్: బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఒకరి హత్య సదాశివనగర్: బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఒకరి హత్య](https://media.getlokalapp.com/cache/5b/c0/5bc08b067e45eaa72c9b7ac0c224b438.webp)
సదాశివనగర్: బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఒకరి హత్య
సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో గత నెల 31న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడిని డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కృష్ణగా గుర్తించారు. గంగాధర్ దుబాయ్ వెళ్లే సమయంలో కృష్ణ భార్యకు సంబంధించిన 4 తులాల బంగారం అప్పుగా తీసున్నాడు. బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని కృష్ణను లింగంపల్లి శివారులో బండరాయితో కొట్టి చంపాడని డీఎస్పీ శ్రీనివాసులు సోమవారం వెల్లడించారు.