దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన చేసింది. యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రూ.49కే 25GB డేటాను పొందుతారు. అయితే, ఇది డేటా వోచర్ కాబట్టి దీన్ని ఉపయోగించడానికి యూజర్లు యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉండాలి. జియో రూ.49 ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక రోజు మాత్రమే. అంటే ఒక రోజులోనే 25GB డేటాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.