మలయాళం సినీపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ (80) కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 16,000 కంటే ఎక్కువ పాటలకు తన గాత్రాన్ని అందించాడు. జయచంద్రన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.