శ్రీశైలం ఆలయానికి 23 రోజుల్లో రూ.3.39 కోట్ల ఆదాయం

71చూసినవారు
శ్రీశైలం ఆలయానికి 23 రోజుల్లో రూ.3.39 కోట్ల ఆదాయం
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత 23 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,39,61,457 ఆదాయంగా వచ్చింది. అలాగే 139.200 గ్రాముల బంగారం, సుమారు 5.400 కేజీల వెండి, 481 యూఎస్ డాలర్లు, కెనడా డాలర్స్‌ 35, యూకే పౌండ్స్ 20, యూఏఈ దిర్హామ్స్‌ 140 సహా పలు దేశాలకు చెందిన కరెన్సీ హుండీ ద్వారా లభించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్