సిరికొండ: రెండు ఆటోలు ఢీ.. వ్యక్తికి గాయాలు
సిరికొండ మండలం న్యావనంది చౌరాస్తా వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గడ్డం శ్రీనివాస్(45) అనే వ్యక్తి కుడిచెయ్యి నుజ్జునుజ్జు అయింది. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా సిరికొండ 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.