ఎల్లారెడ్డి: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

65చూసినవారు
ఎల్లారెడ్డి: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య
తాడ్వాయి: క్షణికావేశం ఇద్దరు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఓ తండ్రి తాను చనిపోతూ ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన ఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ పండుగ రోజు పిల్లలతో కలిసి పాలపిట్టను చూడటానికి చిన్నారులతో కలిసి వెళ్లారు. అయితే ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామ శివారులోని ఓ బావిలో పైకి తేలాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్