AP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 22,558 మంది విద్యార్థులకు రవాణా భత్యం కింద ఎస్‌ఎస్‌ఏ రూ.13.53కోట్లు విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు.