ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్

56చూసినవారు
ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్
AP: తెలుగు ప్రజలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. 'రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగుల తీశాయి. ఈ సంక్రాంతి వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది' అని పవన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్