కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఈ మేరకు పంచారామాల్లో మొదటిదైన అమరావతి బాల చాముండీ సహిత అమరలింగేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ జిల్లాల నుండి భక్తులు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే కృష్ణా నది వద్ద స్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.