తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం జరిగింది. పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభం అయింది. మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. కాగా పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. పీఏసీ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆ పార్టీ నేతలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి, రమణ ఆరోపించారు.