ప్రయాణికురాలి లగేజీ చోరీ.. రైల్వేకి రూ.లక్ష జరిమానా

59చూసినవారు
ప్రయాణికురాలి లగేజీ చోరీ.. రైల్వేకి రూ.లక్ష జరిమానా
రైల్వే ప్రయాణికురాలి లగేజీ చోరీకి సంబంధించి వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సేవల్లో లోపాలు ఉన్నాయని రైల్వేకు రూ.లక్ష జరిమానా విధించింది. బాధితురాలికి మొత్తం రూ.1.08లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికురాలు 2016 జనవరిలో మాల్వా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. ఆ సమయంలో తన లగేజీ చోరీకి గురయ్యిందని..అందులో రూ. 80వేలు విలువైన వస్తువులు ఉన్నాయని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది.