AP: కోనసీమ జిల్లాలో నిర్వహించిన ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. ఈ వేడుకల్లో ఎటు చూసినా ఆయన ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. కొత్తపేట మండలంలో వరిచేల మధ్య నుంచి ప్రభలను ఊరేగించారు. ముందుభాగంలో శివుడి ప్రతిరూపమైన వీరభద్రుడు, వెనుకవైపు పవన్ కళ్యాణ్ ఫొటోలను ఉంచారు. దేవరపల్లి, అవిడి, ఈతకోటలో పవన్ కళ్యాణ్ డీజే పాటలకు జనసైనికులు, అభిమానులు మాస్ స్టెప్పులు వేశారు.