భారీగా పడిపోయిన పేటీఎం యూపీఐ విలువ

82చూసినవారు
భారీగా పడిపోయిన పేటీఎం యూపీఐ విలువ
పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం దెబ్బ పేటీఎం యూపీఐ మార్కెట్ షేర్‌పై భారీగానే ప్రభావం చూపిస్తోంది. మార్చిలో ఈ విలువ(9%) నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఫిబ్రవరిలో పేమెంట్స్ బ్యాంక్‌‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పుడు ఈ విలువ 11%కి తగ్గింది. అయితే యూపీఐ కన్నా వాలెట్‌పైనే సంస్థ ఎక్కువగా దృష్టి సారించడం ఈ క్షీణతకు మరో కారణం అంటున్నారు నిపుణులు. మరోవైపు గత 2 నెలల్లో ఫోన్‌‌పే మార్కెట్ షేర్ 50% పెరగడం గమనార్హం.

ట్యాగ్స్ :