హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 21 ఏళ్లుగా ఊపిరితిత్తులలో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్‌క్యాప్‌ను విజయవంతంగా తొలగించారు. కరీంనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు 5 ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి ఏ ఇబ్బంది లేదన్నారు. ఇటీవల 10 రోజులుగా అతను అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు CT స్కాన్ చేసి పెన్‌క్యాప్ గుర్తించి వెలికితీశారు.