ముత్యాలమ్మ దేవతపై గౌరవంతో తమిళనాడులోని అండమాన్ గ్రామంలో ప్రజలు చెప్పులు ధరించరు

1057చూసినవారు
ముత్యాలమ్మ దేవతపై గౌరవంతో తమిళనాడులోని అండమాన్ గ్రామంలో ప్రజలు చెప్పులు ధరించరు
తమిళనాడు రాజధాని చెన్నైకి 450 కి.మీ దూరంలో 'అండమాన్' అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని ముత్యాలమ్మ దేవత కాపాడుతోందని ఆ గ్రామ ప్రజల నమ్మకం. అమ్మవారిపై ఉన్న గౌరవంతో అ గ్రామంలో ప్రజలు బూట్లు, చెప్పులు ధరించరు. గ్రామ సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే చెప్పులు, బూట్లు తీసివేస్తామని గ్రామస్థులు అంటున్నారు. అయితే ఇతర గ్రామాల నుంచి వచ్చే వారిని బలవంతం చేయరట. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం బూట్లు, చెప్పులు ధరించవచ్చని కొందరు తెలిపారు.

సంబంధిత పోస్ట్