మిరప పైరు పూత దశ నుంచి కాయ దశకు వచ్చే సమయాల్లో కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఎకరం పొలానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ. ప్రొఫికానజోల్ లేదా 100 మి.లీ. డైఫెన్ కొనజోల్, లేదా 200 గ్రాముల ఫైరాక్సీ స్ట్రోబిన్‌ను కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల గంధకం లేదా 200 మి.లీ.ల డైనోకాప్ కలిపి పిచికారీ చేయవచ్చు.