పెరుగుతున్న జనాభా దృశ్య అందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతుంది. కొన్ని దేశాలలో ప్రవాస భారతీయుల పరిస్థితి మరి దారుణంగా తయారవుతుంది. తాజాగా కెనడాలో భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రతిబింభించేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు ఆ రెస్టారెంట్ బయట క్యూ కట్టారు. ఈ ఇంటర్వ్యూ కోసం దాదాపు 3,000 మంది వేచి ఉన్నట్లు తెలుస్తోంది.