చిన్నారి కలను తీర్చిన పోలీసులు (Video)

85చూసినవారు
ప్రస్తుతం వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి రణ్‌వీర్ (9) కలను వారణాసి పోలీసులు నెరవేర్చారు. ఐపీఎస్ కావాలనేది రణ్‌వీర్ కల. కానీ, బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మహామన క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐపీఎస్ హోదాలో చిన్నారిని ఎస్పీ సీటులో కూర్చోబెట్టి సెల్యూట్ చేశారు.