దేశంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైల్ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఇవి జరుగనున్నాయి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబయి హైస్పీడ్ రైలు వ్యవస్థ పనులు జరుగుతున్నాయి.