మొబైల్ ఫోన్‌ను చూస్తూ రోడ్డు దాటుతున్న యువకుడిని అదే రోడ్డుపై బైక్ మీద వస్తున్న ఓ పోలీసు చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. తమిళనాడులోని నల్లంపాళయం-సంగనూరు రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊహించని దాడికి యువకుడు నొప్పితో విలవిల్లాడాడు. కాగా, పోలీస్ ఇలా చేయడాన్ని ప్రజలు ఖండించారు. అసలు బైక్ నడుపుతున్న పోలీసు హెల్మెట్ ధరించలేదని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.