రామోజీ మరణంపై రాజకీయ దుమారం.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

54చూసినవారు
రామోజీ మరణంపై రాజకీయ దుమారం.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు క్షోభ అనుభవించారని రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్స్ ఫండ్ కేసులో సీఐడీ దర్యాప్తు చేసింది. ఈ సమయంలో రామోజీరావు అనారోగ్యంతో బెడ్‌పై పడుకున్న సమయంలోనూ అధికారులు దర్యాప్తు పేరుతో వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.