'వందేభారత్ రైళ్ల సగటు వేగం 76.25Kmphకి తగ్గింది'

59చూసినవారు
'వందేభారత్ రైళ్ల సగటు వేగం 76.25Kmphకి తగ్గింది'
వందేభారత్ రైళ్ల సగటు వేగం గత మూడేళ్లలో గంటకు 84.48కి.మీ. నుంచి 76.25కి.మీ.కి తగ్గిందని ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో 160కి.మీ. ఉండగా, మిగతా ప్రాంతాల్లో 130కి.మీ. లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు తెలిపింది. రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఆ పనులు పూర్తయిన తర్వాత రైళ్లు 250కి.మీ. వేగంతో వెళ్తాయని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్