ఆఫ్రికా వలసదారుల కోసం పోలింగ్ కేంద్రాలు

62చూసినవారు
ఆఫ్రికా వలసదారుల కోసం పోలింగ్ కేంద్రాలు
తూర్పు ఆఫ్రికా నుంచి 14, 17 శతాబ్దాల్లో భారత దేశానికి ‘సిద్దీలు’ అనే తెగకు చెందిన వారు వలస వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో వీరు జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, గుజరాత్‌లోని జఫ్రాబాద్, కఠియవాడ్ వీరి అధీనంలో ఉండేవి. అయితే ప్రస్తుతం ఇక్కడ వారి వారసుల్లో దాదాపు 3,500 మంది ఓటర్లున్నారు. వీరికోసం గుజరాత్‌ సోమనాథ్ జిల్లాని గిర్ అడవుల్లో అధికారులు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

సంబంధిత పోస్ట్