వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ మోసం కేసులో ఇటీవల ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కోసం యూపీఎస్సీ దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా చూపించినందుకు ఖేద్కర్ దోషి అని విచారణలో తేలడంతో సెప్టెంబర్ 2024లో ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ డిస్ క్వాలిఫై అయ్యారు.