మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఘోర ప్రమాదం జరిగింది. ఖునాజీర్ ఖుర్ద్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న బావి మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు సహా ముగ్గురు కూలీలు సమాధి అయ్యారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఎస్‌డీఈఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులందరినీ శిథిలాల నుండి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.