మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలోని సన్నివేశం అంటూ ఒక వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇందులో హీరోయిన్ మాళవికా మోహనన్ ఫైట్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ సీన్ రాజాసాబ్ సినిమాలోనిదా? కాదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవిక, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ పోస్టర్స్ ఎంతో ఆకట్టుకున్నాయి.