రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 17న మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవం జరగనుండడంతో రాష్ట్రపతి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సమీక్ష చేశారు. ఇప్పటికే ఎయిమ్స్‌ను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.