నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

62చూసినవారు
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
TG: రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైటెక్‌ సిటీ శిల్పకళా వేదికలో జరిగే లోక్‌మంథన్‌-2024 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్