28న ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

84చూసినవారు
28న ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఒడిశాలో మరోసారి పర్యటించనున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో ఈనెల 28 నుంచి ‘ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ 2025’ కార్యక్రమం నిర్వహించనున్నారు. రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం, 3.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు.