సోరియాసిస్ ప్రాణాంతకం కాకపోయిన.. దీంతో బాధపడేవారు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు. ఈ వ్యాధి సోకితే చాలు.. ఎంతటి అందమైన చర్మమైనా సరే అందవిహీనంగా మారి చిరాకుగా ఉంటుంది. అలాంటి చర్మాన్ని చూడ్డానికి, ముట్టుకోవడానికి కూడా అసౌకర్యం అనిపించేలా తయారవుతుంది. దీంతో మనలో ఆత్మన్యూనత భావం మొదలవుతుంది. నిజానికీ ఇది అంటువ్యాధి కాకపోయినా.. చూడ్డానికి మాత్రం అందవిహీనంగా ఉండడం వల్ల ఎవరూ కూడా అలాంటి చర్మాన్ని ముట్టుకోవడానికి సాహసించరు.