కిమ్‌ను కారులో తిప్పిన పుతిన్ (Video)

52చూసినవారు
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌లు సరదాగా కారులో ప్రయాణించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కనే కూర్చుని కిమ్ నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా అధికారిక మీడియా విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. రష్యాలో తయారైన లగ్జరీ కారు ఆరస్ లిమోసిన్‌లో ఇరు దేశాధినేతలు ప్రయాణించారు. నలుపు రంగు ఆరస్ కారు రష్యాలో ప్రెసిడెంట్ అధికారిక వాహనం.

ట్యాగ్స్ :