వయనాడ్ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, తన సోదరికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఐ లవ్ వయనాడ్’ అని రాసి ఉన్న టీషర్టుతో రాహుల్ గాంధీ అలరించారు. ఆ టీషర్ట్ ప్రస్తుతం అక్కడి ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసి ప్రియాంక గాంధీ సైతం సంతోషం వ్యక్తం చేశారు.