వయనాడ్ ఎంపీగా 4లక్షలకు పైగా ఓట్లతో గెలిచిన ప్రియాంకా గాంధీ ఇవాళ లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేరళలో ప్రసిద్ధి చెందిన, కసవుగా పిలిచే చేనేత చీరను ఆమె ధరించారు. అయితే ఆమెకు పార్లమెంట్ ఆవరణలోకి రాగానే కాంగ్రెస్ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ప్రియాంకను ఆపి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తన ఫోనుతో ఫొటోలు తీశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.