మనుషులకు ఎంత మాత్రము సాధ్యపడని వాటిని కూడా టెక్నాలజీ సుసాధ్యం చేస్తోంది. తాజాగా జపాన్‌లో సివిల్ ఇంజనీర్లు అద్భుతం సృష్టించారు. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో కేవలం ఆరు గంటల్లోనే రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. వాకయామా సిటీలో హట్సుషిమాలో ఉన్న పాత రైల్వేస్టేషన్ స్థానంలో సెరెడిక్స్ అనే కంపెనీ కొత్త స్టేషన్‌ను నిర్మించింది. ఈ స్టేషన్‌కు 530 ప్రయాణికులకు సేవలను అందించే సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు.