ఖర్గేకు రామభద్రాచార్య స్ట్రాంగ్ కౌంటర్

59చూసినవారు
ఖర్గేకు రామభద్రాచార్య స్ట్రాంగ్ కౌంటర్
AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు శ్రీరామభద్రాచార్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఖర్గే ఇన్‌డైరెక్టుగా చేసిన వ్యాఖ్యలపై స్వామీజీ స్పందించారు. ‘కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేయొద్దని ఎక్కడైనా రాసుందా? కాషాయం ధరించిన వాళ్లు కాకపోతే గూండాలు, లోఫర్లు మాత్రం చేయొచ్చా?’ అని మండిపడ్డారు. కాషాయమంటే దేవుడి రంగు, కాషాయ జెండా ఎగురవేసే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రను ఏకం చేశాడని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్