పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్ లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్ గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్ లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ఏదో విధంగా ఆయన్ను టీంఇండియాలో ఆడించే అవకాశం ఉంది.