పెద్దఅంబర్ పేట్ లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్కేసర్ నుండి పెద్దఅంబర్ పేట్ వైపు లారీ వస్తుండగా ఔటర్ రింగురోడ్డు పై నుండి సర్వీస్ రోడ్డులో లారీ పడిపోయింది. అదే సమయంలో సర్వీస్ రోడ్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కింద పడడాని గమనించిన స్థానికులు 108 కు, పోలీసులకు సమాచారం అందజేశారు. డ్రైవర్ ను హాస్పటల్ కు తరలించే లోపు మార్గమధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.