విశ్వకర్మ వృత్తులను కులాలుగా విభజించకుండా ఒకే కులంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ సర్, శ్రీకాంత చారి విగ్రహాల వద్ద తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ వృత్తులను పంచదాయిలను పంచకూలాలుగా విభజించకుండా ఒకే కులంగా పరిగణించాలని బిసి కమీషన్ కు రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.