ముంపు బాధితులు భయపడొద్దు: ఎమ్మెల్యే

80చూసినవారు
ముంపు బాధితులు భయపడొద్దు: ఎమ్మెల్యే
వర్షాల నేపథ్యంలో జల్ పల్లి మున్సిపాలిటీలోని బుర్ ఖాన్ చెరువు ముంపు బస్తీని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి సోమవారం పరిశీలించారు. నివాసాలు నీట మునిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులతో కలిసి పర్యటించిన ఆమె స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో పాటు ఎగువ బస్తీల నుంచి వస్తున్న డ్రైనేజీ నీటితోనే బస్తీ నీట మునుగుతుందని స్థానిక మహిళలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.