
కడ్తాల్: రైతులకు షాక్ ఇచ్చిన సర్వే సిబ్బంది
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సర్వే నిర్వహిస్తున్న అధికారులు రైతులకు షాక్ ఇచ్చారు. మంగళవారం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో సర్వేను రైతుల అడ్డుకోవడంతో వెనుతిరిగిన అధికారుల బృందం పోలీసుల బందోబస్తు మధ్య తిరిగి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి శివారు నుండి కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామ శివారులో 1. 2 కిలోమీటర్లు సర్వే పూర్తి చేసినట్లు తహశీల్దార్ ముంతాజ్ తెలిపారు.